Breaking News

చిల్లర వేషాల గణేశా.. మక్కెలిరగ తంతా మల్లేశా!

Published on Wed, 04/16/2025 - 12:49

‘గణపతి.. నేను మల్లేష్‌ను.. గ్రూపులో ఎగ్జిట్‌ ఎందుకు కొట్టావు.. నువ్వు ఎవడవు.. తీయడానికి....పోస్టులు పెడితే తీసేస్తావా... ఏ ఫొటోలు పెట్టాను.. ఎంపీ, మంత్రి, దాసునాయుడు ఫొటోలు పెట్టాను.. అంతమాత్రాన తీసేస్తావా? పార్టీ గ్రూపులో ఎలా తీస్తావ్‌. నన్ను తీయడానికి నువ్వెవడివి. పార్టీ కోసం పనిచేశాను. నీలా చిల్లర పనులు చేయిలేదు. టిఫిన్‌ కొట్టోళ్లు, చిల్లర వ్యాపారులు కడుపు కొట్టలేదు.  
– నరసన్నపేటకు చెందిన టీడీపీ నాయకుడు మల్లేష్‌ వాయిస్‌ ఇది..

‘నేను అడ్మిన్‌ని గ్రూపులో ఫొటోలు ఇన్నేసి ఫొటోలు పెడితే ఎలా. అందుకే తీసేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తంతాను.. ఎవడితో చెప్పుకొంటావో చెప్పుకో.. ఎమ్మెల్యే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచం రా.. ఒరే మల్లేసు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నరసన్న పేట వస్తే తంతా ను. పాతే స్తాను. బోకరువు నువ్వు.. ఎమ్మెల్యే గ్రూపులో నీకు ఉంచనురా.. ఏమి పీక్కోంటావో పీక్కో..నీకు అంత సీను లేదు. నువ్వు పార్టీకి అవసరం లేదు. నువ్వు అడగడానికి ఎవడివి. నరసన్నపేట రా.. రెండు కాళ్లు పట్టుకొని క్రిందకి తొక్కెస్తా.. బచ్చా గాడవు, నాఇష్టం.. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్చి వేషాలు వేయకు.. నరసన్నపేట రా తంతాను. ఎవడు అడుగుతాడు చూస్తాను..’ 
– నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి సంభాషణ ఇది

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పీఏ గణపతి, స్థానిక టీడీపీ నాయకుడు మల్లేష్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు నోటికొచ్చినట్టు మాట్లాడుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు. వారి ‘వ్యవహారాలను’ వారే బయట పెట్టుకున్నారు. ఇందులో బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి ఒక అడుగు ముందుకేసి పాతేస్తాను.. తంతాను...అంటూ దర్పాన్ని చూపించగా,  టిఫిన్‌ కొట్టులపై బ్రోకర్‌ పని చేశావ్‌. చిన్నోళ్ల కడుపుకొట్టడం... డబ్బులిచ్చినోళ్లకే పనులు చేశావు. నువ్వు చేసేదేంటి? అంటూ టీడీపీ నాయకుడు మల్లేష్‌ చెలరేగిపోయారు. ఈ ఇద్దరి ఫోన్‌ సంభాషణ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. టీడీపీలో చిచ్చు రేపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  

TDP కార్యకర్త మల్లేష్ పట్ల దురుసగా ప్రవర్తించిన MLA రమణపూర్తి పీఏ

  

 

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?