Breaking News

మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు 

Published on Sat, 07/29/2023 - 03:49

సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్‌ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగా­యి. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్‌ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)