Breaking News

ఎల్లో మీడియా నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది: మంత్రి సురేష్‌

Published on Thu, 09/07/2023 - 07:28

సాక్షి, అమరావతి: గురు­వు­లు కన్నా గూగుల్‌ మేలని తాను అనలేద­ని, తాను అలా అన్నట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా దానిని వక్రీకరించి ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపి తనపై వ్యక్తిగత దాడికి దిగే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తాను ఉపాధ్యాయుడిగా ఉండాలని గర్వపడతానని అదే సభలో మాట్లాడింది వినిపించలేదా.. అని ప్రశ్నించారు. మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఇంటర్నెట్‌ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అనే ఉద్దేశంలో తాను మాట్లాడి­నట్టు తెలిపారు. టెక్నాలజీ పెరిగిపోయి మారిన కాలానికి అనువుగా సమాచారాన్ని గూగుల్‌ తల్లిని అడిగి తెలుసుకున్నానన్నారు.

గూగుల్‌ను సృష్టించింది కూడా గురువులే కదా.. అని ఆయన ప్రశ్నించారు. తాను గురువులను కించపరిచేలా మాట్లాడలేదని, తన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం పైన, తనపైన.. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా తనపై ఎల్లో మీడియా బురద జల్లుతోందని, దీనిని నమ్మొద్దని ఉపాధ్యాయులను కోరారు. అనని మాటలను వక్రీకరించి పత్రికల్లో ప్రచురించుకునే సంస్కృతి మంచిది కాదని మంత్రి సురేష్‌ హితవు పలికారు.
చదవండి: ఐటీ నోటీసులు: అరెస్టు.. పదేళ్ల జైలు!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)