Breaking News

దూసుకొస్తున్న ‘మురసు’ తుపాను

Published on Mon, 11/02/2026 - 05:01

సాక్షి, అమరావతి :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి తుపానుగా బలపడింది. ‘మురసు’ అని నామకరణం చేసిన ఈ తుపాను సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు–నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది.  ఆదివారం రాత్రి చెన్నైకి 420, నెల్లూరుకు 490, మచిలీపట్నానికి 500, ఒంగోలుకు 530, విశాఖపట్నానికి 500 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

రెండు రోజులపాటు వర్షాలు
తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. రాయలసీమలోనూ సోమ, మంగళవారాల్లో అనేక చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను తీరం దాటే ప్రాంతం దక్షిణ కోస్తాలో ఉండటంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.  

రానున్న తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుత వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మంగళవారం ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటొచ్చని తెలిపారు. అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్‌ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒకటి ఉన్నాయన్నారు. 

బుడమేరు సహా పలుచోట్ల వరద ముప్పు..
భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు వద్ద మంగళవారం సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో కూడా భారీ వరద వచ్చే అవకాశం ఉందని వివరించారు. బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)