Breaking News

ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు

Published on Thu, 04/24/2025 - 04:26

విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి ఆస్ట్రేలియా చేపట్టిన చర్యలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అనేక యూనివర్సిటీలు భారత విద్యార్థుల నమోదును నిషేధించాయి. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంపై  కఠిన నిబంధనలు, పరిమితులు విధించాయి. 

ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు పొందుతూ వలస విధానాలకు తూట్లు పొడుస్తున్నారని వర్సిటీలు గుర్తించాయి. నియంత్రణ లేని ఏజెంట్లు, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు, కొందరు ఆపరేటర్లు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సమాచారం. ఫలితంగా విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం మొత్తం భారతదేశ విద్యార్థులపై పడే ప్రమాదం నెలకొంది. – సాక్షి, అమరావతి

ప్రతి నాలుగు దరఖాస్తుల్లో ఒకటి నకిలీ..
భారత్‌ నుంచి వచ్చే ప్రతి నాలుగు విద్యార్థి వీసా దరఖాస్తుల్లో ఒకటి నకిలీదిగా ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌ ధ్రువీకరించింది. భారత్‌ నుంచి వచ్చే మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 24.3 శాతం మోసపూరితమైనవని చెబుతోంది. అంతర్జాతీయ వర్సిటీలకు అతిపెద్ద విద్యార్థి వనరుగా భారత్‌ ఉంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సిటీల తాజా నిషేధంతో చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యం గందరగోళంలో పడుతోంది. 

ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించకుంటే ద్వైపాక్షిక విద్యా సంబంధాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయ విద్యార్థుల వీసాలకు సంబంధించి  కఠినమైన నిబంధనలను అమలు చేసిన తర్వాత ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీల నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.

వలసలను తగ్గించేందుకు..
గత ఏడాది రికార్డు స్థాయిలో వలసలను నియంత్రించే యత్నంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్సిటీలను హెచ్చరించింది. విద్యార్థి వీసా మంజూరుకు పొదుపు డిపాజిట్‌ మొత్తాన్నీ పెంచింది. గత ఏడాది మే 10 నుంచి విద్యార్థి వీసా మంజూరుకు కనీసం రూ.16.30 లక్షలు (29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్ల) బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. అంతకుముందు 2023 అక్టోబర్‌లో పొదుపు మొత్తాన్ని రూ.11.46 లక్షల నుంచి రూ.13.35 లక్షలు (21,041 ఆస్ట్రేలియన్‌ డాలర్ల నుంచి 24,505 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు)కు పెంచింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)