బాబు పాలనలో దేవుడికే రక్షణ కరువు

Published on Sun, 01/04/2026 - 04:13

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పాలనలో దేవుడికే రక్షణ కరువైంది. ఒక ఉన్మాది తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం లోపలి నుంచి పైకెక్కి కలశాలను ధ్వంసం చేయడం, దేవుడి విగ్రహాలను కాళ్లతో తన్నడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వం, దేవదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్‌ అధికారుల ఘోర వైఫల్యమే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లలో టీటీడీ చేతులెత్తేసింది. చివరకు గోవిందమాల స్వాములనూ అడ్డుకోవడం దారుణం’ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు దర్శనాలు నిలిపివేయడం దుర్మార్గమని, తిరుమలకు భక్తులను రావొద్దనడం చరిత్రలో ఇదే ప్రథమమని ఆక్షేపించారు. ఆలయాల్లో తొక్కిసలాటలు, శివలింగం ధ్వంసం వంటి వరుస అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు పాలనలో 20 నెలలుగా టీటీడీలో కోకొల్లలుగా అవకతవకలు జరుగుతున్నాయి. కొండపైకి మద్యం, మాంసంతో యథేచ్ఛగా వస్తున్నారు. చెప్పులు వేసుకుని దర్శనానికి వెళ్తున్నారు. అయినా, పాలక మండలి చోద్యం చూస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది వీఐపీలకు దర్శన టికెట్లు ఇచ్చారో వెల్లడించాలి’ అని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు.  

దుర్గగుడి ఘటనకు మంత్రి బాధ్యత వహించరా? 
‘విజయవాడ దుర్గగుడికి మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం ఘోర తప్పిదం. ఆ సమయంలో 70 వేల మంది భక్తులు ఉన్నారు. దీనికి చిన్నస్థాయి అధికారిని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎంవోకు తెలియకుండా కరెంట్‌ సరఫరా నిలిపివేశారా?’’ అని విష్ణు ప్రశి్నంచారు. 

తిరుమల లడ్డూపై దు్రష్పచారంతో రాష్ట్రానికి చెడు 
‘తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేసిన రోజు నుంచే రాష్ట్రానికి చెడ్డ కాలం మొదలైంది. నేడు ఆలయాలకు భద్రత లేదు, హుండీలకు భద్రత లేదు, గోశాలలో గోవులకు రక్షణ లేదు.హిందూ ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది?’ అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)