Breaking News

పచ్చ మత్తులో జోగుతున్న ఈనాడు

Published on Fri, 07/28/2023 - 04:02

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టనిదే ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు వ్యక్తుల మధ్య ఆవేశకావేశాలతో జరిగిన ఘర్షణకు గంజాయే కారణమని, అది సర్కారు నిర్వాకమని వక్రీకరించింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్టు అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నంచింది. ‘గంజాయి రాజ్యంలో ముఠాల అరాచకం’ శీర్షికన గురువారం దుష్ప్రచారానికి పూనుకుంది.

వాస్తవాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని దమ్మాలవీధికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్‌ కేశవ రాంబాబు ఈ నెల 23న రాత్రి 8.30 గంటలకు తన బైక్‌పై వెళుతూ మార్గం మధ్యలో కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. దిల్లేశ్వరరావు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫి క్‌కు అంతరాయం కలిగింది. దీనిపై తన బైక్‌కు దారి ఇవ్వమని రాంబాబు ఆ వేడుకల్లో ఉన్న యువకులను అడిగారు. దాంతో మాధవ్, దేవా, కార్తిక్‌ అనే యువకులతో రాంబాబుకు వా గ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దాంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా ఇరువర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆ సామాజికవర్గ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ మేరకు రాంబాబు రాజీ లేఖను పోలీసులకు సమర్పంచారు. ఆ లేఖను న్యా యస్థానానికి నివేదించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఈనాడు వక్రీకరించి గంజాయి మత్తు లో ఘర్షణ జరిగిందంటూ దుష్ప్రచారం చేసి, చంద్రబాబుకు అనుకూల వాతావరణం సృష్టించా లని పచ్చపాతాన్ని ప్రదర్శించడం దారుణం.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)