Breaking News

ఐటీ హబ్‌గా విశాఖ

Published on Mon, 10/02/2023 - 05:53

సాక్షి, అమరావతి: రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్‌ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్‌ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్‌గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్‌ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్‌ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్‌ ఇంటెలిజెన్స్‌పై సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ ఎదుగుతోందన్నారు.

ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా ఎంపిక కావడంతో ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో విశాఖపట్ననికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మానవ వనరులను ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా మూడు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుంటుంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచే 1.5 లక్షల మంది వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశాఖకు ఇది కలిసొచ్చే అతిపెద్ద అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు.   

వచ్చే ఐదేళ్లలో కొలువుల పండగ.. 
ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు రానుండగా అందులో ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు పల్సస్‌ గ్రూపు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఆర్టీఫిన్ యల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలోనే విశాఖలో 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ఐటీ రంగం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే హెల్త్‌కేర్, ఫార్మా, మెరైన్‌ ఇండస్ట్రీస్, పర్యాటకం, రక్షణ, విద్య వంటి రంగాలు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సంఖ్య ఐదేళ్లలో ఐదు లక్షలకు చేరుతుందని శ్రీనుబాబు వివరించారు.

Videos

వణికిన మహానగరం

Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి

నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Weather: ఏపీకి భారీ వర్ష సూచన

YSR జిల్లా బద్వేల్‌లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా

మసూద్ అజహర్ ఆచూకీ పసిగట్టిన నిఘావర్గాలు

అక్రమంగా పేదవారి భూమి లాగేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే

YSRCP ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు

హైదరాబాద్ లో భారీ వర్షం

రాబర్డ్ వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలుచేయడంపై స్పందించిన రాహుల్ గాంధీ

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)