Breaking News

దళిత గళం గొంతు నొక్కి!

Published on Tue, 08/15/2023 - 06:30

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్‌ రిజర్వుడు ని­యోజక వర్గాలకు సంబంధించి టీడీపీ దళిత నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలైనా, నియోజకవర్గాలైనా, దళిత నేతలైనా చంద్రబాబు, లోకేశ్‌కు ఎప్పుడూ చిన్నచూపేనని స్పష్టం చేస్తున్నారు.  తాజాగా అమరావతి ప్రాంతం­లో లోకేశ్‌ ప­ర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తాడికొండ మాజీ ఎమ్మె­ల్యే తెనాలి శ్రావ­ణ్‌కుమార్‌కు జరిగిన దారుణ అవమానాన్ని గు­ర్తు చేస్తున్నారు.  

కనీస ప్రాధాన్యం లేకుండా.. 
యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. దాదాపు పన్నెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగింది. సత్యవేడులో హెలెన్, కొండేపిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని గెలిపించాలని కోరడం మినహా మిగిలిన నియోజవర్గాల్లో తమ నాయకులకు లోకేశ్‌ కనీస ప్రాధా­న్యం కూడా ఇవ్వలేదని టీడీపీలో దళిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

గంగాధర నెల్లూరు, సూళ్లూరుపేట, గూడూరు, సింగనమల, కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగినప్పటికీ లోకేశ్‌ దళిత నాయకుల ఊసెత్తలేదు. కనీసం ఇన్‌చార్జీలని చెప్పేందుకూ నిరాకరించారు. పూతలపట్టు ఇన్‌చార్జిగా మురళీమోహన్‌ పేరును యువగళం పాదయాత్ర తరువాత చంద్రబాబు ప్రకటించడం గమనార్హం.  

తమ వారిని హీరోలుగా కీర్తిస్తూ.. 
యువగళం పాదయాత్ర ఇతర నియోజక వర్గాలలో సాగినప్పుడు లోకేశ్‌ తీరులో తేడా స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అద్దంకిలో గొట్టిపాటి, వినుకొండలో ఆంజనేయులు, గురజాల­లో యరపతినేనిని ఆ ప్రాంత హీరోలని ప్రశంసి­స్తూ తమను విస్మరించడాన్ని ఏ కోణంలో చూడాలని టీడీపీలోని దళి­త నాయకులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వుడు స్థానాల్లో నాయకులను చులకనగా చూడటం, ఇతర వర్గాల విషయంలో మాత్రం లోకేశ్‌ వైఖరి కొట్టొచ్చినట్లు కనపడుతోందంటున్నారు.

 ఉన్నత వర్గాలదే పెత్తనం..  
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని రిజర్వుడు స్థానాల్లోనూ ఆయన వర్గానిదే పెత్తనం. జీడీ నెల్లూరు నియోజకవర్గం వ్యవహా­రాలన్నీ చిట్టిబాబునాయుడు కనుసన్నల్లోనే జరగాల్సిందే. గూడూరులో పాశం సునీల్‌ కు­మా­ర్, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమణ్యం, సింగనమలలో బండారు శ్రావణి, సంతనూతలపాడులో విజయకుమార్, బద్వేలులో రాజశేఖర్‌ పేరుకు మాత్రమే నాయకులు. సింగనమలలో అగ్రవర్ణాలకు చెందిన వారితో కూడిన త్రిస­భ్య కమిటీదే పెత్తనం. కోడుమూరులో ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, నందికొట్కూరులో గౌరు వెంకటరెడ్డి, బద్వేలులో కె.విజయమ్మ చెప్పినట్లే నడుచుకోవాలి. అక్కడ దళిత నేతలది మౌనవ్రతమే.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)