Breaking News

సింగయ్య చనిపోయే అవకాశమే లేదు

Published on Tue, 06/24/2025 - 04:02

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి వక్రభాష్యం చెబుతూ కూటమి సర్కార్‌ అక్రమ కేసుల నమోదుకు తెగబడిందని ప్రత్యక్ష సాక్షులు దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్‌ పేర్కొన్నారు. చీలి సింగయ్య అనే కార్యకర్త ప్రైవేట్‌ వాహనం ఢీకొని మృతి చెందినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌ అధికారికంగా ప్రకటించిన తర్వాత మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం నక్క జిత్తులను ప్రదర్శిస్తోందన్నారు

 వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తోందని వారు దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వైఎస్సార్‌సీపీ నేత దాసరి వీరయ్య మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్‌లో వెళ్లాను. మేం చూసే సమయానికి సింగయ్య స్వల్పగాయాలతో ఉన్నారు.

మేం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ.. అక్కడ ఉన్న ఏఎస్‌ఐ రాజశేఖర్‌ వద్దని అడ్డుకున్నారు. అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలన్నారు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు. తలకు ఎక్కడా గాయాలు కూడా కాలేదు. సింగయ్య మరణంపై అనుమానం ఉంది. ఈ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో ఏదైనా జరగొచ్చు’ అని పేర్కొన్నారు. 

తేలికపాటి గాయాలే అయ్యాయి 
హైకోర్టు న్యాయవాది బరిగల కోటేష్‌ మాట్లాడుతూ.. ‘చీలి సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయనకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే నా కారులోంచి గొడుగు తెచ్చి ఆయనకు ఎండ తగలకుండా పట్టుకున్నాను. సోషల్‌ మీడియాలో వచి్చన ఒక వీడియోను తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు. అంతకుముందు ఇంకో కారు నంబర్‌ చెప్పి.. ఇప్పుడు జగన్‌ కారు అని చెప్పటం ఏమి టి? బాధ్యత కలగిన ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు.  సింగయ్య మరణం, ఎలా జరిగిందనే అంశంపై నేను లీగల్‌గా తేల్చుకుంటా’ అని చెప్పారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)