Breaking News

సీబీఐ ఎంట్రీ.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం

Published on Fri, 10/23/2026 - 18:41

సాక్షి, విజయవాడ: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ (లాకప్) డెత్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు.

సీబీఐ అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ అధికారికంగా ప్రారంభమైంది. దర్యాప్తులో భాగంగా సీబీఐ బృందం విజయవాడకు చేరుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో కలిసి, ఈ ఘటనకు కేంద్ర బిందువైన కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సీబీఐ అధికారులు సందర్శించి అక్కడ సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. ఇప్పటివరకు సిట్ సేకరించిన రికార్డులు, ఆధారాలను సీబీఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకుని క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేశారు.

ఏపీ హైకోర్టు కీలక తీర్పు 
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విజయవాడకు చేరుకుని విచారణ ప్రారంభించారు. అలాగే, బాధితురాలు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రూ. 25 లక్షల పరిహారాన్ని నాలుగు వారాల్లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి : సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)