Breaking News

నెల్లూరులో జనసేన రౌడీమూకల అరాచకం

Published on Tue, 07/29/2025 - 04:38

నెల్లూరు సిటీ: కూటమి నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. రౌడీమూకలు పేట్రేగిపోతున్నా­యి. ఫలితంగా సామాన్యులు బెంబేలెత్తుతున్నా­రు. తాజాగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం శ్రామికనగర్‌లో జనసేన గూండాలు సోమవారం అరాచకం సృష్టించారు. తినీతినక రూపాయిరూపాయి పోగే­సి సా­మాన్యులు కట్టుకున్న ఇళ్లను యంత్రాలు తీసు­కొచ్చి మరీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు.  వివరాల్లోకి వెళ్తే శ్రామికనగర్‌లో 3.9 ఎకరాల స్థలంలో  బెల్లంకొండ తిరుపాల్‌ అనే వ్యక్తి ఎకరన్నరం పొలంలో లేవుట్‌ వేశారు.

అప్పట్లో 10 మంది భూమిని విభజించుకుని కొన్నారు. ఆ తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలు 40 మంది వరకు ఆ లేఅవుట్లోని ప్లాట్లను కొని  రిజి్రస్టేషన్లూ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మీడియా చైర్మన్, ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్, మరో ఐదుగురు ఈ లేఅవుట్‌ వేసిన భూమి తమదంటూ హద్దురాళ్లు ఏర్పాటు చేసే యత్నం చేశారు. ప్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ఆ తర్వాత మిన్నకుండిపోయారు.

ఈ క్రమంలో రెండుమూడు నెలలుగా దశలవారీగా అర్ధరాత్రుళ్లు నిర్మాణ దశలో ఉన్న నాలుగు ఇళ్లను దుండగులు కూల్చేశారు. ఎవరి పనో తెలీక నిర్మాణదారులు అయోమయపడ్డారు.  ఈ నేపథ్యంలో సోమ­వారం జనసేన గూండాలు  పేట్రేగిపోయారు. జనసేన నేత నూనె మల్లికార్జున్‌యాదవ్‌ కుమారుడు తన అనుచరులు, రౌడీమూకలు, యంత్రాలతో వచ్చి లేఅవుట్‌లో వేసిన మరో మూడు ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు.

112 ద్వారా కంట్రోల్‌రూం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి కూల్చివేతలను ఆపాలని ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన గంట తర్వాత జనసేన రౌడీలు మూడు ఇళ్లను నేలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డునూ మూసివేస్తూ అప్పటికప్పుడు గోడ కట్టేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేఅవుట్‌లోనే కాపుగాశారు. అక్కడే మద్యం తాగుతూ హల్‌చల్‌ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే బాధితులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే రౌడీమూకలు గోడలు దూకి పరారయ్యారు. ప్రధాన పాత్ర వహించిన కొందరిని పోలీసులు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)