Breaking News

మీ పాలనలో రైతులకు మేలు జరిగిందయ్యా!

Published on Wed, 05/21/2025 - 05:30

సాక్షి, అమరావతి: ‘మీ పాలనలో రైతులందరికీ మేలు జరిగిందయ్యా. మీ హయాంలో రైతుల కష్టాలు తెలుసుకుని అన్నదాతకు అండగా నిలిచి.. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సి వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదయ్యా’ అని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు.

మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు మెర్ల సత్యనారాయణ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంత రైతులు ఎకరాకు 55–60 బస్తాల ధాన్యం పండించారని ఆ రైతు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులంతా నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు.

ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్లాల్లోనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వైఎస్‌ జగన్‌ బదులిస్తూ.. అన్నదాతకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ హామీతో రైతు సత్యనారాయణ సంతోషంతో తాను పండించిన వరి కంకులను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పిల్లి సూర్యప్రకాష్‌ కలిశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)