Breaking News

తల్లి కష్టాన్ని చూడలేక.. భుజం కాసిన బిడ్డ‌లు!

Published on Wed, 01/29/2025 - 19:20

అమ్మ కష్టాన్ని చూడలేక ఈ చిన్నారులు(అక్కా, తమ్ముడు) చలించిపోయారు. పొట్ట కూటి కోసం వలస వచ్చిన ఈ తల్లి పొలం నుంచి వస్తూ వంటకు పుల్లలు పోగు చేసుకుని,  ఆ పుల్లల మోపు తలపై పెట్టుకుని, మరో పెద్ద కట్టెను భుజాన వేసుకుని వస్తోంది. తల్లి కష్టాన్ని చూడలేక ఆమె భుజాలపై ఉన్న పెద్ద కట్టెను చిన్నారులిద్దరూ తమ భుజాలపైకి తీసుకుని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచారు. గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం ఐదో మైలు సమీపంలో కనిపించిన ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది.  – ప్రత్తిపాడు

మంచు జల్లులో తడిసి ప్రకృతి పులకిస్తోంది.. వెండి చినుకులు ఆకుల అంచులపై నుంచి సుతారంగా జాలువారుతూ నేలను మురిపెంగా ముద్దాడుతుంటే.. మట్టి తడిసి ముద్దవుతోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా మలికిపురం మండలం గుడిమళ్ల లంకగ్రామంలో మంగళవారం ఉదయం మంచు కురుస్తున్న దృశ్యం అబ్బురపరిచింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమండ్రి


హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని, ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్‌ (Helmet) వాడాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఆమె ఏలూరులో (Eluru) హెల్మెట్‌ ధరించని వాహనదారులకు మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించని పలువురికి చలానా విధించారు. 
– సాక్షి ఫోటోగ్రాఫర్, ఏలూరు  


కీడల్లో రాణించాలన్న వారి పట్టుదల ముందు రన్నింగ్‌ ట్రాక్‌ చిన్నబోయింది. ఉత్తి కాళ్లపై విద్యార్థినులు పోటీల్లో పరుగు పెట్టిన తీరు ఆకట్టుకుంది. విశాఖపట్నంలో మంగళవారం రాష్ట్ర స్థాయి రన్నింగ్‌ పోటీలు నిర్వహించగా... ఇందులో కొంత మంది విద్యార్థినులు కాళ్లకు షూ లేనప్పటికీ.. పోటీల్లో ఇలా పాల్గొన్నారు. 
– సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం
 


ఫిషింగ్‌ హర్బర్‌లో భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ, విశాఖపట్నం (Visakhapatnam) ఆధ్వర్యంలో రెండు పరిశోధనా నౌకల్లో ప్రజలు, విద్యార్థులు సందర్శన కోసం ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల సందర్శనకు విద్యార్థులు భారీగా బారులు తీరారు.  
– సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం

చ‌ద‌వండి: అమ్మకడుపులో రాచపుండు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)