Breaking News

అసలు ఈ కియా కారు కథేంటి..

Published on Fri, 11/01/2024 - 09:32

ఆత్మకూరురూరల్‌: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్‌ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్‌ స్టేషన్‌ కూడా అప్‌గ్రేడ్‌ అయ్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.

దిక్కుమొక్కు లేక..
ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్‌ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్‌ ప్లేట్‌ లేదు, విండో షీల్డ్స్‌ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్‌ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్‌ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్‌ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.

అసలు ఈ కియా కారు కథేంటి..
ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనే మగ్గుతోంది.

కారు హైజాక్‌ వెనుక హవాలా ముఠా?
పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్‌లో కిడ్నాప్‌ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్‌ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)