Breaking News

పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు

Published on Wed, 08/09/2023 - 08:14

పుంగనూరు (చిత్తూరు జిల్లా): పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు.

వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పల­మనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు.

ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజ­కవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: టీడీపీ నేతకు లివర్‌ వ్యాధి.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రూ.20 లక్షలు మంజూరు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)