Breaking News

రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం

Published on Sun, 02/15/2026 - 07:19

వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్‌ రెడ్డి తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) కళాశాలలో బీఎస్‌ఎమ్‌ఎస్‌ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

 శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్‌ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్‌ సర్కిల్‌ వద్ద ఠాగూర్‌రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్‌ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్‌ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు 
తెలిపారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)