Breaking News

కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Published on Sun, 11/02/2025 - 10:11

సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.

ముందుగా.. తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆరా తీశారు. వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.

కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం: బొత్స సత్యనారాయణ 
కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ  సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..?. సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాతృలం అంటే కుదరదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు.

 

 

 

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)