Breaking News

అక్రమ కేసులతో మా నాన్నను భయపెట్టలేరు: కాకాణి పూజిత

Published on Thu, 05/29/2025 - 12:48

సాక్షి, నెల్లూరు: ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కాకాణి గోవర్థన్‌ రెడ్డి.. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు కాకాణి కుమార్తె పూజితా రెడ్డి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మా నాన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రజలకి మంచి చేసిన ప్రతీసారి మా నాన్న మొహంలో ఆనందం కనిపిస్తుంది. కరోనా సమయంలో ప్రాణాలని కూడా లెక్కచేయకుండా ప్రజలకి సదుపాయాలు కల్పించారు. మంత్రిగా పనిచేసిన రెండేళ్లలో మా నాన్నని నేను ఒక పదిసార్లు మాత్రమే చూశాను.. ఎప్పుడు జనాల్లోనే ఉండేవారు. ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్ధులుగా మాత్రమే చూడాలని.. శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం.

గతంలో పెట్టిన కేసుల్లో విచారణకు నాన్న వచ్చారు. ఈ అక్రమ కేసులో అరెస్ట్ చేస్తారని తెలిసి దూరంగా ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలని బెదిరించాలని, భయపెట్టాలని చూస్తున్నారు. మా నాన్నకు అండగా నిలుస్తున్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా నాన్న కడిగిన ముత్యంలా బయటకి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)