Breaking News

సీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిలిపివేతకు లోపాయికారీ ఒప్పందం నిజమా ? కాదా ?

Published on Sun, 01/25/2026 - 04:56

వెంకటగిరి (సైదాపురం): రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిలిపివేతకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల లోపాయికారీ ఒప్పందాలు నిజమా ? కాదా ? అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శనివారం వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాతే నిలిపివేశారని ఆరోపించారు. చంద్ర­బాబు లోపాయికారితనం ఒప్పందంతో రైతులు అన్యాయం అయిపోతారన్న ఉద్దేశంతో సోమశిల–కండలేరు వద్ద చేపట్టిన ఆందోళనకు నెల్లూరు జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వందలాది మంది అన్నదాతలు తమకు సంఘీభావం తెలిపారన్నారు. అయితే వందలాది మంది పోలీసులను పంపి అన్యాయంగా అరెస్టు చేయించి పోలీసుస్టేషన్‌కు తరలించారన్నారు. 

అదే ప్రాజెక్టు­కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు పోతే వారి వెంట నలుగురు రైతులు కూడా లేరన్నారు. కూట­మి ప్రభుత్వంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని మాయమాటలు చెబుతు­న్నారని.. వారికి దమ్ము, ధైర్యం ఉంటే ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సచివాలయాల వారీ­గా జాబితా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెడ్‌బుక్‌ రాజ్యాంగం పాలన నడుస్తోందని వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంట్‌ పరిశీలకులు, మేడా రఘునాథరెడ్డి విమర్శించారు.   

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజ­లను తప్పుదోవ పట్టించిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. భూముల రీసర్వేతో ఎంతోమంది రైతులకు మేలు జరిగిందని, దీంతో జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసు­తో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్‌ ఎన్నికల ముందు దు్రష్పచారంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. 

రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్‌ సాధించిందని 2023లోనే పార్లమెంట్‌లో కేంద్ర ప్రభు­త్వం సమాధానం ఇచి్చందన్నారు. అందుకు ప్రతిఫలంగా 2025 ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400 కోట్ల నిధులను కేంద్రం రాయితీ రూపంలో మంజూరు చేసిందన్నారు. దీనిని సీఎం చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేట­న్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డిని ముఖ్యంత్రిని చేసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, ఎస్‌ఈసీ సభ్యులు బొలిగర్ల మస్తాన్‌యాదవ్, పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ బి.వెంకటరమణారెడ్డి, సనత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)