Breaking News

చంద్రబాబూ, లోకేశ్‌ ప్రమాణానికి మీరు సిద్ధమా?

Published on Tue, 10/28/2025 - 05:34

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని.. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ సిద్ధమా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. పది రోజుల కిందటే సత్య ప్రమాణా­నికి రావాలని చంద్రబాబు, లోకేశ్‌ను కోరినా రాలేదని ఎద్దేవా చేశారు. భగవద్గీతపై ప్రమా­ణం చేయాలని కోరి­నా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా వారు సత్యప్రమా­­ణానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యం­తో తనకు ఎలాంటి సంబంధం లేదని నార్కో­ఎనాలసిస్, లైడిటెక్టర్‌ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.

‘బెజ­వాడ దుర్గమ్మ, కృష్ణమ్మ సాక్షిగా చెబుతు­న్నా. నిబద్ధత, నిజాయితీ, నిండు మనస్సుతో చెబు­తున్నా. నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం’ అని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రికి జోగి రమేష్‌ సోమవారం కుటుంబ సమేతంగా వచ్చారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మ­వారి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ జోగి రమేష్‌ తన చేతిలో కర్పూరం వెలిగించుకుని నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని సత్యప్రమాణం చేశారు. ‘నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నా హృదయాన్ని గాయపరిచాయి. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడు­కున్నా. నాపై సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ కక్షగట్టారు. ఎక్కడో జరిగిన అంశాన్ని నాకు అంటగడుతున్నారు’ అని జోగి రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.   

ఎవరికి సంబంధం ఉందో ఆ మంత్రికే తెలుసు 
‘ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడు చెప్పింది విని నకిలీ మద్యం కేసులో నన్ను దోషి అంటున్నారు. కానీ రిమాండ్‌ రిపోర్టులో నా పేరు లేదు. నకిలీ మద్యం వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందో జనార్దనరావుకు ఎయిర్‌పోర్టులో రెడ్‌ కార్పెట్‌ వేసిన మంత్రికి తెలుసు. నేను తప్పు చేశానని సిట్‌ అధికారులు నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టండి. కానీ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు. ఎంత బెదిరించినా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో చంద్రబాబుపై పోరాటాన్ని ఆపేది లేదు’ అని జోగి రమేష్‌ స్పష్టం చేశారు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)