Breaking News

స్త్రీధరుడి రాస లీలలు ఇంకెన్నో?

Published on Sat, 01/31/2026 - 07:59

దేశంలో నాడు స్త్రీకి ఉన్నత గౌరవం ఉండేది. ఆమెను దేవతతో సమానంగా చూసేవారు. నేడు బాబు సర్కారులో ఓ మహిళ హోమ్‌ మంత్రిగా ఉండి కూడా అతివలకు రక్షణ కరువైంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఆమెను చెరబడుతున్నారు. అందుకు నిదర్శనం మూడు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన అరవ శ్రీధర్‌ కీచకపర్వమే. ఆ ఒక్కటితో ఆగలేదు ఆయనగారి రాసలీలలు. ఆయన కీచక పర్వం రోజుకొక వీడియోతో కొనసాగుతోంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన రాసలీలలు ఇంకెన్ని బయట పడతాయోనని  నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.  

రైల్వేకోడూరు అర్బన్‌: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఓ మహిళా ఉద్యోగితో జరిపిన కీచక పర్వం వీడియో లీకులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బాధితురాలు రోజుకొక లీకులు సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేస్తున్నారు. నియోజకవర్గమంతా ఇంకా ఎన్ని కొత్త వీడియోలు వస్తాయో? అనే చర్చే కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా నియోజక వర్గంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిశాక సీను మొత్తం రివర్స్‌ కావడంతో టీవీ చానళ్ల ద్వారా జరిగిన విషయాలను బయట పెట్టి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ నిజ స్వరూపం బయట పెట్టింది. 

ఈ మధ్యలో జనసేన నాయకుడు, మరి కొందరూ మంతనాలు జరిపినట్లు తెలిసింది. అయితే బాధితురాలికి నమ్మకం లేక పోవకోవడంతో ఎమ్మెల్యేకి తనకు మధ్యలో జరిగిన విషయాలను బహిర్గతం చేసింది. మూడు రోజులుగా ఫేస్‌బుక్‌ సోషల్‌ మీడియా ద్వారా రోజుకొటి రెండు వీడియోలు రిలీజ్‌ చేస్తూ ఉన్న వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. కొత్తగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఒంటరిగా కారు తోలుతూ బాధిత మహిళకు వీడియోకాల్‌ చేసి ‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా నేను ఉండలేను’ అంటూ ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది. కొత్త కోణంలో ఈ చిత్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

పోలీసులు ఎంక్వైరీ సక్రమంగా సాగేనా? 
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తల్లి ప్రమీలమ్మ తన కొడుకుని, తమ కుటుంబ సభ్యులను ఆ మహిళా ఉద్యోగి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని ఆరోపణలు చేస్తూ బాధిత మహిళపై రైల్వేకోడూరులో పోలీసులకు ఈనెల 7వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ చంద్రశేఖర్‌ ఆరోపిస్తున్న మహిళపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని చెబుతున్నారు.  త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఆమె అందుబాటులో లేదని, నోటీసు ఇచ్చి విచారణ చేస్తామని, దీనికి తోడు మరో కేసు నమోదు చేసామన్నారు. ఇదిలా ఉండగా జిల్లా పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు కేసు నమోదు కాలేదు. ఏకపక్షంగా ఎంక్వయిరీ జరిగేలా నాయకులు పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అజ్ఞాతంలోకి అరవ శ్రీధర్‌ 
ఈవిషయం జరిగిన మరుక్షణం నుంచి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అజ్ఞాతంలోని వెళ్లారు. మరుసటి రోజు ఆ వీడియోలకు తనవి కావని చట్టరీత్యా నిరూపించుకుంటానని ఎక్కడో ఉండి వివరణ ఇచ్చాడు. అంతేకాని మూడురోజులవుతున్నా ఎవరికీ అతని జాడ తెలియలేదు. ఎవరితోనూ సంప్రదించలేదని తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోవడంతో అధికారిక కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతోంది. ఎమ్మెల్యే అయ్యి ఉండి అతను  బహిరంగంగా ప్రజలకు ఎం జవాబు చెబుతాడోనని ఉత్కంఠగా పలువురు ఎదురు చూస్తున్నారు.

 

 

ఇంత వరకు ఖండించని స్థానిక పార్టీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌  
ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, వీడియోలపై ఇంతవరకు, జనసేన పారీ్టకాని, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గానీ ఖండించలేదు. ఎవరికీ వారు తమ పనులు చేసుకుంటూ విషయం ఎవరికీ తెలీదన్నట్లు ఉన్నారు. ఎమ్మల్యే అరవ శ్రీధర్‌ను అన్నీ తానై గెలిపించిన టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కా రూపానందరెడ్డి ఈ తతంగంపై మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)