Breaking News

వినూతతో సన్నిహితంగా ఉంటున్నాడనే రాయుడి హత్య?

Published on Sat, 07/12/2025 - 10:18

సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్‌ రాయుడి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అయి ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. 

తన దగ్గర పని చేసిన శ్రీనివాసులు అలియాస్‌ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి(తాజా మాజీ) వినూత కోటా (Vinutha Kotaa) శనివారం అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వేకువజామున 3గం. టైంలో వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa)ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్‌ ఏ అరుణ్‌ మీడియాకు వెల్లడించారు. 

శ్రీనివాసులు(రాయుడు)ని ఆంధ్రాలో హత్య చేసి.. చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్‌ ట్రేస్‌ చేసి నిందితులను అరెస్ట్‌ చేశాం. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కోటా వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు చెప్పారాయన.

ఏం జరిగిందంటే.. 
చెన్నై మింట్ పీఎస్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కూవం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో.. పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినూత అనే పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. ముగ్గురు నిందితులు దస్త సాహెబ్(షేక్‌తసన్‌), శివకుమార్, గోపిలను అరెస్ట్‌ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై మృతదేహం ఆమె మాజీ డ్రైవర్‌ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. 

చిత్రహింసలకు గురి చేసి..
బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్‌ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్‌ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్‌లో.. అటు సోషల్‌ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అయితే.. 

ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించామని తొలుత ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే లోతైన విచారణలో.. డ్రైవర్‌తో తన భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక చంద్రబాబు ఈ హత్య చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఆ భార్యభర్తలు ప్లాన్‌ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని ఓ గోడౌన్‌లో రాయుడిని టార్చర్‌ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని చెన్నైలో తమ వాహనంలో ఆ భార్యభర్తలు మృతదేహాన్ని మోసుకెళ్లి పడేశారు. ఇదిలా ఉంటే..శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ఆమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.

చ‌ద‌వండి: ప‌వ‌న్ @ పెద్ద‌మ్మ భాషా పితామ‌హ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)