Breaking News

జనసేన నేత అనుమానాస్పద మృతి

Published on Mon, 07/27/2026 - 16:25

సాక్షి,తిరుపతి: జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ శివకుమార్ (48) తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనడీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

శివకుమార్ ఈనెల 26న తన ఇంటి నుండి బయలుదేరి తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించారు. అనంతరం తిరుపతి కెనడీ నగర్‌లో ఉంటున్న తన బంధువు చింతల రమణమూర్తి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇంటి బాత్రూంలో శివకుమార్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి భార్య కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్ఐ రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.

మృతిపై ముసురుతున్న అనుమానాలు 
శివకుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు పర్యటనలో ఉన్న సమయంలో పెరియపాలెంలో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారని, అక్కడే ఇద్దరు వ్యక్తులు తమ సిమ్ కార్డులను పారేసినట్లు శివకుమార్ బంధువు పవన్ తెలిపారు. నిన్న తిరుపతిలోని రమణమూర్తి ఇంటికి శివకుమార్, పవన్ కలిసి వచ్చారు. ఈరోజు ఉదయం వైఫై కనెక్ట్ అవ్వడంతో, వాట్సాప్ కాల్ ద్వారా పవన్‌తో శివకుమార్ భార్య కళ్యాణి మాట్లాడారు. ఆ మాట్లాడిన కొద్దిసేపటికే శివకుమార్ బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు.

తిరుపతిలో జనసేన నాయకుడు ఆత్మహత్య

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)