Breaking News

శ్రీశైలం ఫారెస్ట్‌ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్‌

Published on Fri, 08/22/2025 - 11:32

సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్‌ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది. 

ఆగస్టు 19 మంగళవారం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఫారెస్ట్‌ సిబ్బంది తమకు అనుకూలంగా పని చేయడం లేదని దూషించారు. పైగా సీసీకెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే.. అనూహ్యంగా.. జనసేన నేత పేరును ఈ కేసులో ఏ1గా చేర్చి, దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. పైగా ఇద్దరి పైనా బెయిలబుల్ కేసులే పెట్టారు. 

ఫారెస్ట్‌ అధికారులు చెప్పింది ఏంటంటే..  శ్రీశైలం శిఖరం చెక్‌పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించాడు. అంతేకాదు.. నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్‌లో బంధించి వేధించాడు. 

ఇదీ చదవండి: అరాచకాలకు కేరాఫ్‌ ‘బుడ్డా’

ఈ సంఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తరువాత శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, యర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది,అసోషియేషన్ నాయకులు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. 

పవన్‌ ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై   115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంట గట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ”ఇదేమీ బానిస‌త్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)