Breaking News

లక్ష్మిని అరెస్టు చేసిన పోలీసులు

Published on Tue, 02/11/2025 - 02:50

సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన తిరుపతి ఇన్‌చార్జ్‌ కిరణ్‌రాయల్‌(Kiran Royal) బాధితురాలు లక్ష్మి(Laxmi)ని సోమవారం తిరుపతిలో జైపూర్‌ పోలీసులు అరెస్ట్‌(Jaipur Police Arrest) చేశారు. కిరణ్‌రాయల్‌ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.

ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్‌ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్‌ ముగిసిన వెంటనే.. జైపూర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. లక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్‌ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు.

ఇప్పుడు అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్‌ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు. 

బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకెళ్లిన పోలీసులు
జైపూర్‌ పోలీసులు లక్ష్మిని అరెస్టుచేశాక రుయాలో పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి కోర్టుకు తరలించారు. కోర్టు ఆవరణలో లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆమెను తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుప రిచారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని మీడియా వారు లక్ష్మిని ప్రశ్నిస్తుంటే.. ఆరోగ్యంగా ఉందని పోలీసులు సమాధానం ఇస్తూ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.

41ఏ నోటీసు ఇస్తే సరిపోతుంది
లక్ష్మిపై 2021లో జైపూర్‌లో కేసు నమోదైందని, అందులో ఆమె ఏ6గా ఉన్నారని, ఈ కేసుకు 41ఏ నోటీసు ఇస్తే సరిపోతుందని తిరుపతికి చెందిన న్యాయవాది విజయకుమార్‌ తెలిపారు. లక్ష్మిని అరెస్ట్‌ చేసిన పోలీసులు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఫాలో కాలేదని చెప్పారు. పవన్‌ అభిమానినని కాలర్‌ ఎగరేసుకు తిరుగుతా రెండేళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి జైపూర్‌ పోలీసులతో అరెస్టు చేయించింది వైఎస్సార్‌సీపీనే అని జనసేన నేత కిరణ్‌రాయల్‌ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. వైఎస్‌ జగన్‌పై తాను పది రూపాయల పోస్టర్‌ తయారు చేస్తే తనకు రూ.10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చారన్నారు. రూ.25 లక్షలు లక్ష్మికి ఇచ్చి తనపై ప్రయోగించారని ఆరోపించారు. తాను పవన్‌ అభిమానినని, కాలర్‌ ఎగరేసుకు తిరుగుతానని చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)