Breaking News

జనసేన కిరణ్‌ రాయల్‌కు షాక్‌

Published on Wed, 02/12/2025 - 16:33

సాక్షి, తిరుపతి: జనసేన కిరణ్‌ రాయల్‌ బాధితురాలు లక్ష్మికి బెయిల్‌ మంజూరైంది. లక్ష్మికి జైపూర్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కిరణ్‌ రాయల్‌ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సోమవారం మీడియా సమావేశం పెట్టిన లక్ష్మి.. కిరణ్‌ రాయల్‌ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అయితే, ప్రెస్‌మీట్‌ జరుగుతున్న సమయంలో రంగ ప్రవేశం చేసిన రాజస్థాన్‌ పోలీసులు.. చెక్‌బౌన్స్‌ కేసంటూ లక్ష్మిని అరెస్ట్‌ చేశారు. కిరణ్‌ రాయల్‌ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం  కూడా చేసింది.

ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్‌ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి రెండు రోజుల క్రితం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్‌ ముగిసిన వెంటనే.. జైపూర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: తన వెనుక పవన్‌ ఉన్నాడని కిరణ్‌ రాయల్‌ బెదిరించేవాడు

లక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్‌ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు. అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్‌ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు.

 

 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)