Breaking News

చంద్రబాబుకు ఐటీ నోటీసులు

Published on Fri, 09/01/2023 - 08:22

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.

అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. 

చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు
షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు, చాట్‌లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్‌ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్‌ తనను కలిసి పార్టీకి ఫండ్‌ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్‌మెంట్‌ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)