Breaking News

బైపాస్‌ సర్జరీ నేపథ్యంలో రెండు నెలలు పొడిగించిన హైకోర్టు

Published on Fri, 06/27/2025 - 04:09


సాక్షి, అమరావతి: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంపై నమోదైన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు కింది కోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్‌ ఆంజనేయులు తరఫున న్యాయవాది నగేష్‌రెడ్డి వాదనలు వినిపించారు.

అనారోగ్య కారణాలతో పిటిషనర్‌కు కింది కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందన్నారు. ఈ గడువు గురువారంతో ముగుస్తుందని చెప్పారు.ఈ నెల 25న పీఎస్సార్‌ ఆంజనేయులుకు బైపాస్‌ సర్జరీ జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పీఎస్సార్‌ ఆంజనేయులుకు 2 నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు.

మధుసూదన్‌కు వైద్య పరీక్షలు చేయించి నివేదికివ్వండి
ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ పమిడికాల్వ మధుసూదన్‌ బెయిల్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మధుసూదన్‌ చెబుతున్న నేపథ్యంలో గాల్‌బ్లాడర్, కిడ్నీ వ్యాధుల వైద్యులతో ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి, నివేదికను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)