Breaking News

చంద్రబాబుకు జ్ఞానాన్ని ప్రసాదించండి

Published on Fri, 01/03/2025 - 05:39

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడసెంట్రల్‌)/కపిలేశ్వ­రపురం­/­అయినవిల్లి : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బుద్ధి, జ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రసాదించాలని కోరుతూ వలంటీర్లు ఎన్టీఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏపీ వలంటీర్‌ అసోసియేషన్, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ సింగ్‌నగర్‌ కృష్ణా హోటల్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ వలంటీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, అన్ని విధాలా న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కూడా వలంటీర్లతో సేవలు చేయించుకొని, సచివాలయాల్లో కనీసం అటెండెన్స్‌ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా వివక్ష చూపుతోందన్నారు. 

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వలంటీర్లకు న్యాయం చేసేలా చూడాలని కోరుతూ ఎన్టీఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్య­క్రమంలో మమత, దమ్ము రమేష్, నరేష్, కల్యాణ్, షేక్‌ సైదాబీ, భాను, తేజస్విని, స్వప్న, షైనీ, రాజ్‌ కుమార్, సీపీఐ నాయకుడు కె.వి.­భాస్కరరావు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీని అమలు చేయాలి  గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. 

కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలోని పంచాయతీ కార్యాలయాల్లో ఈ మేరకు గురువారం వారు వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో వలంటీర్లు తమ సమస్యలపై సచివాలయంలో వినతిపత్రం అందజేశారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?