Breaking News

అల్లు అర్జున్‌పై జనసేన, టీడీపీ అనుచిత పోస్టులు

Published on Wed, 12/25/2024 - 05:32

సాక్షి, అమరావతి: ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ను కించపరిచేలా గంటల వ్యవధిలో వేలాది పోస్టు­లు మంగళవారం సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి. దీనివెనుక జనసేన, టీడీపీ ఉన్నాయని అల్లు అర్జున్‌ అభిమానులు  పేర్కొంటున్నారు. ఒకే రకమైన కంటెంట్‌తో ‘ఆర్గనైజ్డ్‌’గా చేస్తేనే తక్కువ వ్యవధిలో భారీ సంఖ్యలో ఇలాంటి పోస్టులు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

అల్లు అర్జున్‌ను మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్‌ పోలీసులు నోటీసు జారీ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ అల్లు అర్జున్‌ను అవమానించేలా ‘కన్నింగ్‌ స్టార్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జనసేన, టీడీపీ నేతలు అనుచిత పోస్టులను వేలాదిగా వైరల్‌ చేశారు. కడుపుమంట చల్లార్చుకోవడానికి ఇలా ఆర్గనైజ్డ్‌గా హీరో అర్జున్‌ మీద బురదచల్లి జన­సేన, టీడీపీ ఆనందిస్తున్నాయని అల్లు అర్జున్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇలాంటి దుష్ట సంప్రదాయం ‘ఆర్గనైజ్డ్‌’గా చేసేవారు భద్రంగా ఉంటూ ఎదుటి వారిపై బురద చల్లుతున్నామని అనుకుంటారని, ఆ బురద తమకు అంటుకోదనే భ్రమలో ఉంటారని చెబుతున్నారు. ‘సొంత పవర్‌ని వదిలి అద్దె లెవన్‌కు వెళ్లినప్పటి నుంచే ఈ దరిద్రాలు’ అంటూ పోస్టుల్లో పేర్కొనడం ద్వారా ఎవరు చేస్తున్నారో.. ఎవరు చేయిస్తున్నారో అనే విషయం స్పష్ట­మవుతోందని అభిమానులు పేర్కొం­టున్నారు.

‘కర్మ సిద్ధాంతం.. దరిద్రం’ వంటి పోస్టులు అన్నీ ఒక రకంగా వేర్వేరు పేర్లతో కేవలం గంటల సమయంలో ‘ఫేస్‌బుక్‌’ తోపాటు ‘ఎక్స్‌’లోనూ ప్రత్య­క్షం కావడంపై ఇదంతా కేవలం ఉద్దే«శపూర్వకంగా రాజకీయ పార్టీలు చేస్తున్న పనేనని సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)