Breaking News

హైదరాబాద్‌-విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు

Published on Sun, 09/01/2024 - 16:52

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం ఐతవరం వద్ద 65వ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌, విజయవాడ హైవేలో వచ్చేవారు తప్పనిసరిగా వరద ఉధృతిని గమనించి  ప్రయాణించాలని అధికారులు సూచించారు.

తెలంగాణ -ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ‌ కాలువకు భారీ గండి‌ పడింది. దాదాపు యాభై మీటర్ల మేర గండి పడటంతో వేల‌ క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. పంటల పొలాలు మునిగిపోయాయి. గండి పడ్డా కూడా ఘటనా స్థలానికి ఇరిగేషన్‌ అధికారులు రాలేదు. పలుచోట్ల సాగర్‌ ఎడమ లైనింగ్‌ దెబ్బతింది.

గతంలోనే లైనింగ్, సాగర్ ఆధునికీకరణ కోసం వేల కోట్ల రూపాయల‌ కేటాయింపు జరిగింది. కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా లైనింగ్ చేసి‌ చేతులు దులుపుకున్నారు. పలుచోట్ల గండ్లు పడే ప్రమాదం ఉందని గతంలో అనేకసార్లు సాక్షి మీడియా హెచ్చరించింది. అయినా కూడా అధికారుల్లో చలనం లేదు. ఫలితంగా నడిగూడెం మండలంలో భారీ గండి పడింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)