Breaking News

మూడేళ్లయినా చార్జిషీట్‌ ఎందుకు వేయలేదు?

Published on Fri, 10/25/2024 - 05:36

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్‌ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్‌ డెలప్‌మెంట్‌ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. 

కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్‌ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్‌ మైండ్‌ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్‌ సరెండర్‌ చేసిన పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్‌ జడ్జిని ఆదేశించింది. 

రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్‌ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్‌పోర్ట్‌ని సరెండర్‌ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్‌ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడి
సుమన్‌ బోస్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్‌ పలు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్‌ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)