Breaking News

హైకోర్టు అంటే లెక్కేలేదు

Published on Thu, 09/18/2025 - 05:44

సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పయినా తమకు లెక్కేలేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోది. డీఎస్సీ దర­ఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రా­దాన్యం చెల్లదని, అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది. సోమవారం హడావుడిగా డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఇతర ఉపాధ్యాయులతో కోర్‌ కమిటీలను నియమించి ఎంపిక చేసిన 15,941 మంది అభ్యర్థులతో పాటు అదేస్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా.. పోస్టుల ఎంపికపై అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 

దీనిపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లినా సింగిల్‌ జడ్జి తీర్పునే అమలు చేయాలని చెప్పడంతో పాటు మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నియామక పత్రాల పంపిణీ చేపడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.  

రాజకీయ మైలేజీ కోసం.. 
డీఎస్సీ ఎంపిక జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 16,347 పోస్టులు ప్రకటించగా.. 15,941 మంది ఎంపికైనట్టు ప్రకటించారు. గతంలో డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాల్లోనే కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎంపికైన వారికి డీఈవో నియామక పత్రాలు అందించేవారు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళుతోంది. 15,941 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబంలోని ఒకరు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సమాచారం పంపించారు. అంటే మొత్తం 32 వేల మందిని ఈనెల 19న అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను బట్టి 65 నుంచి 134 వరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. 

అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గురువారం సాయంత్రానికి సంబంధిత జిల్లా కేంద్రానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లోనే బయలుదేరాలని స్పష్టం చేసింది. వీరిని సమన్వయం చేసేందుకు ఒక్కో బస్సుకు ఒక్కొక్క ఎంఈవో, ఒక్కో హెచ్‌ఎం, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అంటే జిల్లాకు సరాసరిన 350 మంది సిబ్బందిని ఇందుకోసం సిద్ధం చేసింది. కాగా.. హైకోర్టు ఇంటీరియం ఆర్డర్‌ అమలుపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదు 
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం అ­మరావతిలో నియామక పత్రాల ప్రదాన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదని వి­ద్యాశాఖ తెలిపింది. బంధువులు, సన్నిహి­తులు, స్నేహితులను కూడా తీసుకురా­వొచ్చని ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో వృద్ధు­లు, గర్భిణులు ఉంటే వారికి బదులు మ­రొకరి పేరు సూచించవచ్చని చెప్పింది. ఈ అ­వ­కాశం లేని అభ్యర్థులు ఒక్కరే వచ్చేలా ఉంటే ఆ వి­షయం స్థానిక డీఈవోలకు తెలియజేయాలంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)