Breaking News

నకిలీ మద్యం కేసు దర్యాప్తు... ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Published on Thu, 11/06/2025 - 05:42

సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ... న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం  ఉత్తర్వులు జారీ చేశారు. 

జోగి అరెస్ట్‌ తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికిముందు జోగి రమేష్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. 

మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్‌ కాకముందు ఎన్నడూ జోగి రమేష్‌ గురించి మాట్లాడలేదు. పోలీస్‌ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్‌ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్‌ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన త­రువాత పిటిషనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు’’ అని పే­ర్కొ­న్నారు. 

మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సి­ట్‌ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నా­రు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపా­­టి శ్రీనివాస్‌ స్పందిస్తూ పిటిషనర్‌ ఇప్పటికే అరెస్ట­య్యారని, , ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలి­పా­రు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.

దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు 
ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)