Breaking News

ఏళ్ల తరబడి కౌంటర్‌ దాఖలు చేయరా?

Published on Sat, 10/18/2025 - 04:35

సాక్షి, అమరావతి: సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ 2017లో పిటిషన్‌ దాఖలైతే.. ఏళ్లు తరబడిగా పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఏమిటీ నిర్లక్ష్యమంటూ మండిపడింది. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారంటూ పోలీసులను నిలదీసింది. తీరిగ్గా మీకు కావాల్సినప్పుడు కౌంటర్‌ దాఖలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటారా? అని నిలదీసింది. ఇలాగే వదిలిస్తే.. పదేళ్ల తరువాత కూడా కౌంటర్‌ దాఖలు చేసినా ఏమీ కాదనే ధోరణితో అధికారులు ఉంటారని, దీనివల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకంపోతుందని వ్యాఖ్యానించింది. 

ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితిని రానివ్వబోమని స్పష్టం చేసింది. ఎనిమిదేళ్లుగా కౌంటర్‌ దాఖలు చేయకుండా చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడు అందుకు అనుమతి కోరడాన్ని తప్పుబట్టింది. ఈ అసాధారణ జాప్యానికి రూ.10 వేలు ఖర్చుల కింద చెల్లించాలని, అప్పుడు మాత్రమే కౌంటర్‌ దాఖలుకు అనుమతినిస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.నాగేంద్ర ప్రసాద్‌కు స్పష్టం చేసింది. 

ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయవాదుల క్లర్కుల సంఘానికి చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టుకు సరైన వివరాలు వెల్లడించనందుకు సుమోటోగా చేపట్టిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో నాగేంద్ర ప్రసాద్‌కు నోటీసులు జారీ చేస్తూ దీనిపై విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు... 
కొందరు వ్యక్తులతో తమకున్న సివిల్‌ వివాదాలపై పోలీసులు జోక్యం చేసుకోవడంపై  అనంతపురం జిల్లా ధర్మవరం వాసి ఏ.రాజశేఖర్‌ 2017లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు దాఖలు చేయలేదు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సమయంలో ధర్మవరం వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. 

లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు పిటిషనర్‌ రాజశేఖర్‌పై కేసు నమోదు చేశామని 2017లో పేర్కొన్న పోలీసులు ఇటీవల అందుకు విరుద్ధంగా చెప్పారు. అసలు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడంపై న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ తీవ్రంగా స్పందించారు. ఇలా పరస్పర విరుద్ధ వివరాలను కోర్టు ముందుంచినందుకు నాగేంద్ర ప్రసాద్‌పై న్యాయమూర్తి సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టారు.   

పోలీసులకు స్పష్టమైన సందేశం ఇవ్వదలిచాం
తాజాగా ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ప్రతి దశలోనూ కనిపిస్తోందన్నారు. ఇటీవల కాలంలో కోర్టుల పట్ల పోలీసులు అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందువల్లే పోలీసుల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని, తద్వారా వారికి స్పష్టమైన సందేశం పంపదలిచామన్నారు. కోర్టు ఒకసారి నోటీసులు జారీ చేసిన తరువాత పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసి తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. రిట్‌ రూల్స్‌ ప్రకారం 180 రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలన్నారు.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)