Breaking News

సాయిభార్గవ్‌ను ఎలా అరెస్ట్‌ చేస్తారు..?

Published on Sat, 09/27/2025 - 05:23

గుంటూరు లీగల్‌: సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారన్న నెపంతో అమాయకులను అరెస్ట్‌ చేయడంలో కూటమి ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సా­హం మరోసారి బహిర్గతమైంది. ఇలాంటి అరెస్ట్‌ విష­యంలో గుంటూరు సీబీసీఐడీ కోర్టు నుంచి పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. యూరియాపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఫ్యాబ్రికేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారని నమోదుచేసిన అక్రమ కేసు­లో ఆరో నిందితుడిగా చేర్చిన సాయిభార్గవ్‌ను గురువారం సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచారు. 

పోలీ­సు­లు తనను తీవ్రంగా కొట్టినట్లు సాయిభార్గవ్‌ న్యా­య­మూర్తికి తెలిపారు.  దీంతో సాయిభార్గవ్‌ను వైద్య పరీక్షలకు పంపాల్సిందిగా జడ్జి ఆదేశించారు. గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గురువారం అర్ధరాత్రి సీబీసీఐడీ కోర్టు  ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సాయిభార్గవ్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు.  కేవలం సెల్‌ఫోన్‌ ఆధారంగా సాయిభార్గవ్‌ను నేరంలోకి లాగడం సరికాదన్నారు. 

పోలీసులు ఆరోపించిన విధంగా నిందితునికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.  వాదనలు విన్న జడ్జి ఈ అరెస్ట్‌ విషయంలో పోలీసుల పనితీరును తీవ్రంగా తప్పు పట్టారు. సాయిభార్గవ్‌ను అరెస్ట్‌ చేసిన విధానంలో పోలీసుల విధి నిర్వహణ సక్రమంగా లేదన్నారు.  పోలీసుల తప్పిదాన్ని ఎత్తి చూపిస్తూ,  సాయిభార్గవ్‌ను ఏ విధంగా అరెస్ట్‌ చేస్తార­ని ప్రశ్నించారు. తగిన ఆధారం లేకుండా కేవలం అధికారంతో అమాయకులను అరెస్ట్‌ చేయ­డం  సరికాదన్నారు. 

కేవలం సెల్‌ఫోన్‌ ఆధారంగా సాయిభార్గవ్‌ను నేరంలోకి ఎలా లాగుతారని నిలదీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. సాయిభార్గవ్‌ను రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. అక్టోబర్‌ 8వ తేదీలోపు రూ. 25 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం సాయిభార్గవ్‌ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. మంగళగిరిలో నమోదయిన ఇదే కేసులో సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వజ్రాల తారక్‌ ప్రతాప్‌ రెడ్డికి కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం తారక్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)