Breaking News

గూండాలను వెన‘కేసు’కొస్తారా?

Published on Tue, 07/15/2025 - 04:27

గుడివాడ రూరల్‌: బీసీ మహిళ, కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, వైఎస్సార్‌ సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ  గూండాలు తిరిగి వారిపైనే అక్రమ కేసు బనాయించి మరో డ్రామాకు తెర తీశారు. నాగవరప్పాడు వద్ద జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తనను కారుతో ఢీకొట్టి గాయపరిచారని, అందులో ఉన్న వైఎస్సార్‌ సీపీ నేత తనను దూషించారంటూ తెలుగు మహిళా నేత మాదాల సునీతతో సోమవారం గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అయితే తమ కళ్లముందే దాడి చేసిన గూండాలను పోలీసులు వెనకేసుకు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్‌ పర్సన్‌ హారికకు ప్రభుత్వమే కారుతోపాటు డ్రైవర్‌ను కూడా సమకూర్చిందని, మహిళను ఢీకొట్టారన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గుడివాడలో ‘రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో..’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు తీవ్రంగా యత్నించారు.

వివాదాస్పద పోస్టర్లు ఏర్పాటు చేయడమే కాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాకుండా సభకు వెళ్లే రహదారుల్లో గంజాయి, మద్యం తాగిన టీడీపీ కిరాయి గూండాలు కాపు గాసి వీరంగం సృష్టించారు. పచ్చ ముఠాలు తమ ఎదుటే జెడ్పీ చైర్‌ పర్సన్‌ కారును ధ్వంసం చేసి మారణాయుధాలతో సంచరించినా పోలీసులు స్పందించకుండా ప్రేక్షకపాత్ర వహించారు. హత్యాయత్నానికి పథకం వేసిన టీడీపీ గూండాలను అరెస్టు చేయకుండా మిన్నకుండిపోయారు. చిన్న చిన్న సెక్షన్ల కింద తూతూమంత్రంగా కేసులు నమోదు చేశారు.    

బాబు, లోకేశ్‌ డైరెక్షన్‌లోనే..!
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ డైరెక్షన్‌లోనే గుడివాడలో టీడీపీ కిరాయి గూండాలు అలజడి సృష్టించినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో మరో కొత్త డ్రామాకు తెర తీశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తనను కారుతో ఢీకొట్టి గాయపరిచారని ఫిర్యాదు చేసిన తెలుగు మహిళా నేత మాదాల సునీతను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఫిర్యాదుపై మీనమేషాలు లెక్కించిన పోలీసులు.. సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఆగమేఘాలపై ఉప్పాల రాముతోపాటు మరికొందరు వైఎస్సార్‌సీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైనా గతంలో టీడీపీ గూండాలు దాడికి పాల్ప­డ్డారు. తిరిగి ఆయనపైనే అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన అసలు జిల్లాలోనే ఉండకూడదని పోలీసులు ఆదేశించారు. కోర్టు అనుమతి తీసుకుని స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమైనా పోలీసులు సహకరించడం లేదు. కేతిరెడ్డి లేకపోతే తాడిపత్రిలో తమ అరాచకాలకు అడ్డు ఉండదనేది టీడీపీ పన్నాగం. ఇక ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నెల్లూరు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపైనా నెల్లూరులో పచ్చముఠాలు ఓ పథకం ప్రకారం దాడికి తెగబడ్డాయి. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో చొరబడి 80 ఏళ్ల వయసున్న ఆయన మాతృమూర్తిని భయభ్రాంతులకు గురి చేసి విధ్వంస కాండకు దిగారు. తిరిగి ప్రసన్నకుమార్‌రెడ్డిపైనే కేసులు బనాయించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)