పతనం ఖాయమనే ‘సర్‌’లో కుట్రలు

Published on Thu, 07/02/2026 - 05:13

స్వార్థ రాజకీయం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్‌లో వారికి పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకుతారు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తారా.. వేయరా.. అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయం కాదు.  - వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు తన పతనం ఖాయమని నిశ్చయించుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ­(సర్‌)ను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్ర­హం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి­పరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాటా­్ల­­­డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి­పరులకు ఎన్యూ­మ­­రే­షన్‌ ఫామ్స్‌ జారీ చేయకుండానే ఇచ్చేసినట్టు రాసేసుకోవాలని చంద్రబాబు ఆర్డీవోలకు వీడియో కాన్ఫ­రెన్స్‌ ద్వారా ఆదే­శించారని మండిపడ్డారు. 

ఎన్యూ­మరేషన్‌ ఫామ్స్‌ సమ­ర్పిం­చలేదనే సాకుతో వైఎస్సార్‌­సీపీ ఓట్లు తొలగించే కుట్ర­కు తెరలేపుతున్నారన్నారు. అసలీ మనిషికి మాన­వత్వం ఉందా.. అని ప్రశ్నించారు. ‘స్వార్థ రాజకీ­యం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్య­త్‌లో పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకు­తా­రు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తా­రా? వేయరా? అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అను­మానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయమా? ఓట్లు తొలగించాలని మంత్రులు అధికారు­లకు ఆదేశాలు ఇస్తున్నారు. 

ఇందు కోసం మై టీడీపీ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే దాని­పై ఈఆర్‌వో హోదాలో ఉన్న నెల్లూరు మున్సిపల్‌ కమిష­నర్‌.. మంత్రి నారాయణతో చర్చించిన ఆడియో బయ­టకు వచ్చింది. ఇలా నేరుగా మంత్రులు అధికా­రులతో మాట్లాడుతూ టీడీపీ యాప్‌ ద్వారా ఓట్లు తొలగి­స్తు­న్నారు. అధికా­రులు దగ్గరుండి దుర్మార్గాలు చేస్తుంటే వ్యవ­స్థలు ఎలా బాగుపడతాయి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)