Breaking News

రాయలసీమకు మరణశాసనం రాసింది చంద్రబాబే: శ్రీకాంత్ రెడ్డి

Published on Tue, 01/06/2026 - 17:27

సాక్షి తాడేపల్లి: ప్రాజెక్టుల విషయంలో క్యూసెక్కులు, టీఎంసీలకు మధ్య కనీస తేడా సైతం తెలియని వ్యక్తి మంత్రి నిమ్మల రామనాయుడని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.  అలాంటి వ్యక్తికి రాయలసీమ ఎత్తిపోతల పథకం విలువ ఏలా తెలుస్తుందని ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిప్టుతో ఎన్ని జీవితాలు  ముడి‌పడి ఉన్నాయన్న విషయం మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు.

రాయలసీమను ఎడారిగా మార్చబోతే  దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ తెచ్చి ఊపిరి పోశారన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోతిరెడ్డిపాడును అడ్డుకునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ప్రభుత్వానికి రాయలసీమ మీద ఎందుకంత కోపమో తెలియదన్నారు. చంద్రబాబే రాయలసీమకు మరణ శాసనం రాశారని తెలిపారు.1995లో ఆల్మట్టి డ్యాం నిర్మాణాన్ని ఆపలేదు. అప్పటినుంచే చంద్రబాబు రాయలసీమ విషయంలో కుట్రలు జరుపుతున్నారని తెలిపారు.

ఇప్పుడు రాయలసీమ లిఫ్టుపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు సహించరన్నారు.  ఆల్మట్టి నుండి జూరాలకు‌ నీరు వచ్చేసరికే  వాటిని పక్క రాష్ట్రాలు దోచేస్తున్నాయి. శ్రీశైలంలో 800 అడుగులకు నీరు రాకముందే తెలంగాణకు జలాలు వెళుతున్నాయి. ఇక వీటన్నిటిని దాటి ఇక రాయలసీమకు నీరు ఏప్పుడు వస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం డేడ్ స్టోరేజీ వాటర్ కూడా ఉండడం లేదు. చంద్రబాబు  నిర్లక్ష్యం వలనే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.

బ్రహ్మం సాగర్, గండికోట ప్రాజెక్టులను మాజీ సీఎం జగన్ పూర్తి చేశారని  ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమకు చేసిందేంటని ప్రశ్నించారు. మంత్రి నిమ్మలతో చంద్రబాబు మాట్లాడించిన మాటలను వెంటనే  వెనక్కు తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకోవాలని తెలిపారు.

Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)