Breaking News

‘ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్‌ కాలేజ్‌ పూర్తి చేయొచ్చు’

Published on Fri, 12/19/2025 - 15:01

తాడేపల్లి: కూటమి ‍ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తుందని  మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు ద్వజమెత్తారు.  కూటమి ప్రభుత్వ కేవలం 18 నెలల కాలంలోనే రూ.2.70లక్షల కోట్ల అప్పులు చేసిందని, సరాసరిన రోజుకు రూ. 550 కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు (శుక్రవారం, డిసెంబర్‌ 19వ తేదీ) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వం చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్‌ కాలేజ్‌ పూర్తి చేయొచ్చన్నారు.

ఇటీవల జరిపిన ఒక గంట యోగా కార్యక్రమం కోసం రూ. 330 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో ఇదివరకే రూ.వేల కోట్లు దుబారా చేయగా  ఇప్పుడు మళ్లీ వేల కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేవేటీకరణను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని జనమంతా ఆగ్రహంతో ఉన్నారని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని జనానికి అర్థం అయిందని తెలిపారు.అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతాకాలు చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం దాగి ఉందని మాజీ మంత్రి అప్పల్రాజు పేర్కొన్నారు. 

భూమి ప్రభుత్వానిది ఆదాయం మాత్రం ప్రైవేట్‌వారికా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెండేళ్ల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలా ఆ జీతాల సొమ్ముతో మరో రెండు వెద్యకళాశాలలు కట్టవచ్చని తెలిపారు.108, 104లను అనర్హులకు కట్టబెట్టిన వైనంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చూశారని తెలిపారు..

అందుకోసమే కరోనా సమయంలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు వైద్యం అందకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ప్రైవేటీకరణను రద్దు చేసి తీరాతం అని మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు తెేల్చిచేప్పారు. 

Appalaraju: అధికారుల ముందు తప్పు ఒప్పుకున్న బాబు

రాష్ట్రంలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.. పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని పరిశ్రమలపై దాడులు చేసి మూసివేసేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం లేదని తెలిపారు. సనాతనవాదని అని గొప్పలు చెప్పుకుతిరిగే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోమాంసం దొరికితే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

పరకామణి విషయంలో కోర్టు పరిధిలో సెటిల్మెంట్ జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయటం ఆయన సంకుచిత బుద్దికి నిదర్శనమని తెలిపారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?