Breaking News

Andhra Pradesh: విదేశీ విద్య.. ఇప్పుడు మిథ్య!

Published on Mon, 11/04/2024 - 05:17

పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని దెబ్బ తీసేందుకు కూట­మి సర్కారు కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదల్చకుండా ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వ­డం ఆపే­సింది. కొత్తగా విదే­శాలకు వెళ్లిన విద్యార్థులు చేసు­కున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు.

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నా­రు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ పేరుతో నిధుల విడుదల­ను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అం­దుతుంద­నే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమి­టో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులకు రూ.107.07 కోట్లు అందించింది. గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజుల మొత్తా­న్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో మరోమారు నిధులు విడుదల చే­యా­­ల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడు­దల చేయకుండా తాత్సారం చేస్తుండ­ట­ం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటేకనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు.

ఏదైనా అప్‌డేట్‌ ఉందేమో చూద్దామనుకుంటే జ్ఞాన భూమి పోర్టల్‌ అస­లు తెరుచుకోవడం లేదు. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దర­ఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యా­­­ర్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభు­త్వం ఎత్తేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నా­యి. సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌­లకు విద్యార్థుల తల్లి­దండ్రులు ఇటీవల వినతులు సమర్పించనప్పటికీ వారి నుం­చి స్పష్టత రాక పోవడం శోచనీయం. 
 – సాక్షి, అమరావతి

ప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞాన భూమి పోర్టల్‌ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. నెలలు గడుస్తున్నా మా ఆవేదన పట్టించుకోవడం లేదు. అదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి సాయం అందేది. ఇప్పుడొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సాయం అందించకపోతే మా అబ్బాయి చదువు కోసం మేము అప్పులు చేసి అవస్థలపాలుకాక తప్పదు.
 – గుంటూరుకు చెందిన ఒక చిరుద్యోగి  

మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్‌ చదివిద్దామని విదేశీ విద్యా సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. మా దరఖాస్తు ఏమైందో తెలియదు. జ్ఞాన భూమి పోర్టల్‌ తెరుచుకోవడం లేదు. విదేశీ విద్య పథకాన్ని కొత్త ప్రభుత్వం నిలిపేస్తుందని అంటున్నారు. నిబంధనల పేరుతో సాయాన్ని అరకొరగా పరిమితం చేస్తారంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తుందో లేదో తెలిస్తే.. మా తిప్పలు మేము పడతాం. 
– పశ్చిమదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ రైతు ఆవేదన

పేద బిడ్డలపై పెద్ద మనసు చూపిన జగన్‌
విదేశాల్లో చదివేందుకు వెళ్లిన పేద బిడ్డలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 408 మందికి రూ.107.07 కోట్లు అందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016–17 నుంచి అమలు చేసిన పథకంలో 3,326 మందికి రూ.318 కోట్లు ఎగ్గొట్టింది. అదే మాదిరి ఈసారి కూడా విదేశీ విద్య పథకంలో ఎంపికైన వారికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

⇒ గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను విస్మరించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కేవలం రూ.15 లక్షలు చొప్పున మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకొంది. అదే జగన్‌ సర్కారు ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు సాయం అందించింది. వైఎస్‌ జగన్‌ అగ్రవర్ణ పేదల(ఈబీసీ)తో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు.

⇒ ప్రపంచంలో టాప్‌ 50 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంíపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల(సెమిస్టర్‌)ల్లో ఆ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేవారు.

⇒ విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వ­మే చెల్లించేది. పీజీ, పీహెచ్‌డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీ­బీఎస్‌ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథ­కాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభు­త్వం వ్యవహరిస్తుంటం పట్ల సర్వ­త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)