Breaking News

ఆహారం కలుషితం.. 78 మందికి పైగా వైద్య విద్యార్థులకు అస్వస్థత

Published on Wed, 07/29/2026 - 05:28

తిరుపతి తుడా: తిరుపతిలో మూడు వైద్యకళాశాల్లో ఆహారం కలు షితం కావడంతో 78 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, శ్రీవేంకటేశ్వర వైద్యకళాశాల (స్విమ్స్‌), శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థులయ్యారు. ఈ మూడు కాలేజీల్లోని విద్యార్థులకు స్విమ్స్‌లోని సెంట్రల్‌ క్యాంటీన్‌ నుంచి ఆహారం సరఫరా అవుతుంది. సోమవారం మధ్యాహ్నం ఆకుకూర పప్పు వడ్డించిన క్యాంటీన్‌ నిర్వాహకులు రాత్రిపూట కూడా అదే వడ్డించారు. 

ఆకుకూరను సరిగా శుభ్రపరచకుండా వండారని, మధ్యాహ్నం వండినదాన్నే రాత్రికి కూడా పెట్టటంతో అప్పటికే కలుషితమైన దాన్ని తిని తమకు వాంతులు, విరేచనాలు అయ్యాయని పలువురు విద్యార్థులు తెలిపారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో 20 మంది విద్యారి్థనులు, ఎనిమిది మంది విద్యార్థులు.. మొత్తం 28 మంది అస్వస్థులయ్యారు. స్విమ్స్, శ్రీ పద్మావతి కళాశాలల్లో 50 మందికిపైగా ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురయ్యారు.ఆయుర్వేద విద్యార్థుల్లో 17 మందిని అంబులెన్స్‌లో టీటీడీ సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. 

చికిత్స పొందుతున్నవారిని టీటీడీ జేఈవో డాక్టర్‌ శరత్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్‌ పాయిజన్‌ అవడంతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో తిరిగి వసతిగృహాలకు పంపించినట్లు తెలిపారు. స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో అస్వస్థులైనవారికి పద్మావతి ఆస్పత్రిలో గోప్యంగా వైద్యం అందించినట్లు తెలిసింది.

అబ్బే అదేం లేదు.. ముగ్గురే అస్వస్థులయ్యారు..  
స్విమ్స్, పద్మావతి విద్యార్థులు ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు నిరాధారమని స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్విమ్స్‌ హాస్టల్లో మొత్తం 1,147 మంది వైద్యవిద్యార్థులు ఉన్నారని తెలిపారు. 27వ తేదీ రాత్రి సమయంలో ఎంబీబీఎస్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థులయ్యారని అంగీకరిస్తూనే.. ఫుడ్‌ పాయిజనింగ్‌ అయిందనటం సరికాదని ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో 70 మందికి పైనే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని స్విమ్స్‌ వర్గాలు తెలిపాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)