Breaking News

AP: వలంటీరన్నా గుర్తొస్తున్నావ్‌!

Published on Tue, 09/03/2024 - 09:50

ప్రస్తుతం భారీ వర్షాలకుతోడు వరదలతో పలు జిల్లాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తే యడంతో ఆదుకునేవారు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లను వరదనీరు చుట్టుముట్టడంతో బయటకు వచ్చే దారిలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాగడానికి గుక్కెడు తాగునీరు లేక.. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం వాడుకుని ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని బాధితులు మండిపడుతున్నారు. 

గత ప్రభుత్వ హయాంలో వరదలు సంభవించినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో వలంటీర్లు స్వయంగా భుజం లోతు నీళ్లలోనూ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి క్షేమ సమాచారాలు ఆరా తీశారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు ఆహార పదార్థాలు, బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించారని చెబుతున్నారు. నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు నిత్యం వరద పరిస్థితిని అంచనా వేయడం, నది గట్లు ఎలా ఉన్నాయో పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలిపేవారని అంటున్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను పక్కనపెట్టడంతో తమకు కోలుకోలేని దెబ్బ తగిలిందని బాధితులు వాపోతున్నారు.  

నాడు: వలంటీర్ల సేవలతో ప్రజలు సురక్షితం

బి.దొడ్డవరంలో ట్రాక్టరులో కూరగాయలు తీసుకువచ్చి అందిస్తోన్న వలంటీర్‌ కోళ్ల సురేష్‌   

మామిడికుదురు మండలంలో నడుములోతు నీటిలో నిత్యావసరాలు అందిస్తున్న సురేష్‌ 

అప్పనపల్లి బాడవలో బాధితుల కోసం పీకల్లోతు ముంపులో నిత్యావసరాలను బుజానకెత్తుకుని వెళుతోన్న వలంటీర్‌ నీతిపూడి నాగరాజు   

నేడు: బాబు జమానాలో ప్రజలకు ఇక్కట్లు 

సింగ్‌ నగర్‌ ప్లై ఓవర్‌పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు  

సింగ్‌ నగర్‌ ప్లై ఓవర్‌పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు  

కుందావారి కండ్రికలో బాధితులే వాటర్‌ క్యాన్లు తెచ్చుకుంటున్న దృశ్యం 
 

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)