Breaking News

‘ఫైబర్‌నెట్‌’ నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతివ్వండి

Published on Tue, 11/07/2023 - 05:13

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన ఆస్తుల అటాచ్‌­మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ సోమవారం పిటి­షన్‌ దాఖలు చేసింది. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని ఆ పిటిషన్‌లో కోరింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రూ.330 కోట్ల ఫైబర్‌నెట్‌ మొదటి దశ ప్రాజెక్ట్‌ కాంట్రాక్టును అప్పటి సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కేటాయించారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఏ–1గా వేమూరి హరికృష్ణ, ఏ–11గా టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ–25గా చంద్రబాబును పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో టెరాసాఫ్ట్‌ కంపెనీతో పాటు ఈ కేసులోని నిందితులకు ఏపీ, తెలంగాణలో ఉన్న ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను రాష్ట్ర హోం శాఖ ఆమో­దిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాటి అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఆ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ చర్యలు చేపట్టనుంది.

ఫైబర్‌నెట్‌ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తులు..

  • నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల ఇంటి స్థలం, ఆయన డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌కు విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌.
  • మరో నిందితుడు టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ టి.గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్‌ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్‌లు, యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్, ఆయన భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)