Breaking News

కూతుర్ని రూ. 20 లక్షలకు తెగనమ్మి.. తండ్రి జల్సాలు

Published on Tue, 11/18/2025 - 09:51

ఎన్టీఆర్ జిల్లా: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతురినే బేరానికి పెట్టిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో విడాకులు తీసుకుని మద్యానికి బానిసయ్యాడు. తనకున్న పొలాన్ని కూడా అమ్ముకుని వచ్చిన సొమ్ముతో తాగి జల్సాలు చేస్తున్నాడు. తన స్నేహితుడైన బెల్లంకొండ నాగరాజును బావమర్ది అని సంబోధిస్తూ.. ఇద్దరూ కలిసి తాగుతూ, తిరుగుతూ ఉండేవారు. 

ఈ క్రమంలో నాగరాజు తన 15ఏళ్ల కుమార్తెతో వివాహం జరిపిస్తానని చెప్పి పలు దఫాలుగా జమలారెడ్డి వద్ద నుంచి రూ.20లక్షలు వరకు దండుకుని కారు తదితరాలు కొనుక్కున్నాడు. ఆ విధంగానే ఎవరికీ తెలియకుండా జమలారెడ్డికి ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. అయితే ఆ మైనర్‌ బాలిక కాపురానికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి నాగరాజు మరోసారి తనకు డబ్బు కావాలని జమలారెడ్డిని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకొస్తే ఇస్తానని చెప్పాడు. 

దీంతో నాగరాజు తన కుమార్తెను జమలారెడ్డి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. జమలారెడ్డి మైనర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇరువురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)