Breaking News

వాన కాటు.. సర్కారు పోటు

Published on Wed, 12/25/2024 - 06:16

సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేయడం రైతులకు ఆశనిపాతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాకం వల్ల మద్దతు ధర దక్కక గగ్గోలు పెడు­తున్న రైతులు.. తాజాగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదేలవుతున్నారు. 

మరో వైపు కళ్లాల్లోని పంట నేలకొరిగి ముంపునకు గురవుతుంటే.. ఇంకో వైపు కోసిన ధాన్యం రాసు­లన్నీ తడిసి ముద్దవుతున్నాయి. కళ్లెదుటే ధాన్యం మొలకలెత్తి.. రంగు మారిపోతూ.. తేమ శాతం అంతకంతకు పెరిగిపోతుండడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వరుస వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

పంట ఏపుగా ఎదిగే వేళ జూలైలో కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రెండోసారి విత్తుకున్నారు. పంట ఏపుగా ఏదిగే వేళ సెప్టెంబర్‌లో వరదలు, భారీ వర్షాలు దెబ్బతీస్తే.. కోత కోసే సమయంలో ఫెంగల్‌ తుపాన్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమేస్తున్నాయి. కృష్ణా డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 

పల్నాడు జిల్లాలో ఇంకా పంట పూర్తిగా చేనుపైనే ఉంది. ఉత్తరాంధ్ర మొదలు పల్నాడు వరకు 8 లక్షల ఎకరాల్లో పంట చేలల్లోనే ఉంది. శ్రీకాకుళంలో 70 వేల ఎకరాలు, అనకాపల్లిలో 65 వేలు, కృష్ణా డెల్టాలో 80 వేలు, గుంటూరులో 30 వేల, బాపట్లలో 1.82 వేల ఎకరాలు, పల్నాడులో 50 వేల ఎకరాల్లో పంట చేనుపై ఉంది. ఆయా జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట ముంపు నీటిలో చిక్కుకుని నేలకొరిగింది.

మొలకెత్తుతున్న ధాన్యం 
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఆయా జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా కప్పుకునేందుకు టార్పాలిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అద్దెకు తెచ్చుకొని మరీ కప్పుకుంటున్నారు. 

మరొక వైపు ఒబ్బిడి చేసుకునేందుకు, చేనుపై వరిగిన పంటను కాపాడుకునేందుకు కూలీలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరొక వైపు రైతుల వద్ద సిద్ధంగా ఉన్న 3–4 లక్షల టన్నుల ధాన్యం రంగుమారి, మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర లభించక అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పౌర సరఫరాలు, మార్కెటింగ్‌ శాఖాధికారులు.. దళారీలు, మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో 75 కేజీల బస్తాకు 300–400 వరకు నష్టపోతున్నారు. వరుస వైపరీత్యాలతో తేమ 20–25 శాతం మధ్య నమోదవుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాలు, మంచు ప్రభావంతో అది 25–30 శాతం వరకు వెళ్లొచ్చని వాపోతున్నారు. 

16 లక్షల టన్నుల ధాన్యం మాటేంటి?
రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా, 34.92 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 84.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు తొలుత 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించగా, దాన్ని 36–37 లక్షల వరకు పెంచినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే 22.80 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టుగా ప్రభుత్వం చెబుతుండగా, ప్రొక్యూర్‌మెంట్‌ వెరైటీస్‌కు సంబంధించి 16 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది. 

అత్యధికంగా శ్రీకాకుళం, కృష్ణ జిల్లాల్లో 2.50 లక్షల టన్నుల చొప్పున, విజయనగరం జిల్లాలో 1.50 లక్షల టన్నులు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో లక్ష టన్నుల చొప్పున ధాన్యం ఉంది. నాన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ వెరైటీస్‌కు సంబంధించి మరో 3–4 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)