Breaking News

నకిలీ మద్యం కేసు: జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Published on Sat, 10/11/2025 - 21:04

విజయవాడ:  నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ టీడీపీ నేత జనార్థన్‌రావు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు ఎక్సైజ్‌ పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్థన్‌రావును అక్టోబర్‌ 17వ తేదీ వరకూ రిమాండ్‌ విధించిన నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. 

లిక్కర్ బిజినెస్‌లో లాభాలు లేవని జనార్దన్ రావుతో చేతులు కలిపారు టిడిపి నాయకుడు జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక సంఖ్యలో మద్యం షాపులను దక్కించుకున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 2025 జూన్ నుంచి ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం తయారీ జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

తెలంగాణలోని హైదరాబాద్ నుంచి NDPL  లిక్కర్‌ను తీసుకొని  ఏఎన్‌ఆర్‌ బార్ లో జనార్ధన్ రావు అమ్మకాలు  జరిపినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో  E-7 అనే బార్ లో పార్టనర్ గా చేరిన జనార్ధన్ రావు.. అక్కడ చీప్ లిక్కర్‌ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్‌తో  గోవా కి వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్‌లో కలిసి ఉన్న బాలాజీ తో చేతులు కలిపారు. 

బాలాజీ ద్వారా స్పిరిట్, హీల్స్, క్యాప్‌లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్‌ఆర్‌ బార్‌లో విక్రయించారు. ఈ నకిలీ మద్యం తయారు చేసేందుకు.. ఫేక్ లేబుల్స్, లిక్కర్ బాటిల్స్ శ్రీనివాస్, రమేష్ అనే ఇద్దరు సప్లయ్ చేసిన విషయం వెల్లడైంది.  నకిలీ మద్యం తయారు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఇబ్రహీం పట్నంకి స్పిరిట్‌ తరలించేవారు. జనార్ధన్‌రావు సోదరుడు జగన్మోహనరావు ద్వారా నకిలి బ్రాండ్‌లను తయారు చేశారు.

జయచంద్రారెడ్డి కారు డ్రైవర్‌ అరెస్ట్‌..
అన్నమయ్య జిల్లా: 
తంబళ్లపల్లి నియోజకవర్గంలో ములకలచెరువు కల్తీ మద్యం కేసులోఎక్సైజ్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్‌ను అరెస్టు చేశారు. అష్రఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు  తరలించారు.  నకిలీ మద్యం కేసులో ఏ 21 నిందితుడుగా ఉన్న అష్రఫ్.. నకిలీ మద్యాన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు గ్రామాలకు  తరలించినట్లు గుర్తించారు.

రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అష్రప్ బయటపెట్టినట్లు సమాచారం. టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డికి చెందిన బ్లాక్ స్కార్ఫియో వాహనంలో నకిలీ మద్యం బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం. మరొకవైపు టిడిపి నేతలు జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది కోసం పోలీసుల బెంగళూరులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

ఇదీ చదవండి: 
పక్కావ్యూహం ప్రకారమే..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)