Breaking News

కోనసీమ నుంచి తమిళ సీమకు.. అరటిపండ్లలో ఈ అరటి వేరయా..!

Published on Sun, 07/16/2023 - 04:21

‘అరటిపండ్లలో ఎర్ర చక్కెరకేళి అరటి వేరయా..’ అంటారు పండించే రైతులు,  వైద్యనిపుణులు. సాధారణ అరటి కన్నా మిన్నగా అరుదైన పోషకాలు ఉండే ఈ పండును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. పండించే రైతుకు నిలకడైన ఆదాయాన్ని అందించే ఈ రకం అరటికి చెన్నై మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. గోదావరి లంకల్లో పండే ఈ రకం అరటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.

ఈ ఎగుమతుల విలువ ఏటా కోట్లలో ఉంటోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎర్ర చక్కెరకేళి సాగు అధికం. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, అలమూరుతో పాటు అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ రకం పంటను సాగుచేస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో కూడా ఈ రకం అరటి సాగు ఎక్కువే.

ఈ మూడు జిల్లాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. ఎకరాకు 700 నుంచి 800 చెట్ల వరకు పెంచుతారు. అధికంగా గోదావరి లంక భూముల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇక మైదాన ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా కూడా వేస్తారు. – సాక్షి, అమలాపురం

ధర ఘనం 
ఎర్ర చక్కెరకేళి అరటిపండుకు మంచి డిమాండ్‌ ఉంది. దీని గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకు ఉంటోంది. డిమాం­డ్‌ అధికంగా ఉన్నప్పుడు రూ.400 నుంచి రూ.500 వర­కు పలుకుతోంది. ప్రస్తు­­తం రావులపాలెం మార్కె­ట్‌లో గెల సైజును బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు  ధర ఉంది. అప్పుడప్పుడు ధరలు నే­ల చూపులు చూసినా సీజన్‌లో ఢోకా ఉండదని చెబుతున్నారు. కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలతో పోలిస్తే ఎర్ర చక్కెరకేళీకి నిలకడైన ధర ఉంటోంది.

రావులపాలెం కేంద్రంగా.. 
ఈ మూడు జిల్లాల్లో పండే అరటిపంటను రావులపాలెం మార్కెట్‌ యార్డు నుంచి ఎగుమతి చేస్తుంటా­రు. ఇక్కడి నుంచే ఎర్ర చక్కెరకేళి అధికంగా తమిళనాడు, తక్కువ మొత్తంలో కేరళకు ఎగు­మతి అవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో మొద­లయ్యే సీజ­న్‌ ఆగస్ట్‌ వరకు ఉంటుంది.

ప్రస్తు­తం రోజుకు 6 నుంచి 10 వ్యాన్ల గెలలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో వ్యాన్‌లో 350 వరకు గెలలుంటాయి. వీటి­విలువ సు­మారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఏ­టా రూ.52 కోట్ల మేర ఎర్ర చక్కెరకేళి ఎగుమ­తులు జరుగుతాయి. సీజన్‌లో యార్డు వద్దకు రాకుండా నేరుగా రైతు తోటల వద్ద నుంచే రవాణా చేస్తుంటారు.

పోషకాలు అధికం
ఎర్ర చక్కెరకేళి అరటిలో ఎక్కువగా ఉన్న పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి శరీరంలో క్యాల్షియం పెంచు­తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర­ుస్తుంది. సాధా­రణ అరటిపండ్లలో కన్నా దీన్లో పోషకాలు అధికం. ఖనిజాలు, విట­మి­న్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.

ఇతర అరటిపండ్ల కన్నా బీ­టా కెరోటిన్‌ అధికం. ఇది గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. విట­మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. హిమోగ్లోబిన్‌ శాతాన్ని గణ­నీయంగా పెంచుతుంది. 

సాగులో ప్రతికూలతలు 
ఎర్ర చక్కెరకేళి సాగుకు కొన్ని ప్రతికూలతలున్నాయి. సాధారణ అరటి దిగుబ­డి ఎనిమిది నెలలకే మొదలవుతుంది. ఇది ఏడాదిన్నర సమయం పడుతుంది. కార్శి తోటగా సాగుచేయడం పెద్ద ప్రయోజనకరం కాదు. బలమైన పోషకాలున్న నే­లలు అవసరం. ఇతర అరటి రకాల కన్నా ఎరువులు, పురుగుమందులు అధిక­ంగా వినియో­గించాలి. పెట్టుబడి సైతం ఎకరాకు రూ.లక్ష అవుతుంది. చెట్టు ఎత్తు పెరుగుతున్న­ందున తుపాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ.

తమిళనాడు ఎగుమతులపైనే వ్యాపారం 
రావులపాలెం మార్కెట్‌ యార్డ్‌కు వచ్చే అరటిగెలల్లో 10 శాతం ఎరుపు చక్కెరకేళి అరటి గెలలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తమిళనాడుకు, తక్కువగా కేరళకు ఎగుమతి అవుతాయి. స్థానికంగా కొనుగోలు చేయడం చాలా తక్కువ. తమిళనాడు మార్కెట్‌పైనే ఇక్కడ వ్యాపారం ఆధారపడి ఉంటోంది. కానీ దీనికి నిలకడైన ధర మాత్రం దక్కుతోంది.  – కోనాల చంద్రశేఖరరెడ్డి,  అరటి వ్యాపారి, రావులపాలెం

పెట్టుబడి అధికం 
ఎర్ర చక్కెరకేళి సాగు­లో పెట్టుబడి అధికం. ఇతర అరటి రకాల సాగు కన్నా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అధికం. పంటకాలం కూడా ఎక్కు­వ. ఒకసారి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. కార్శి పంట దిగుబడి పెద్దగా రానందున గిట్టుబాటు కాదు. కానీ ధర మాత్రం లాభసాటిగా ఉంటోంది. మంచి దిగుబడి వచి్చ, రికార్డుస్థాయి ధర ఉన్నప్పుడు మాత్రం ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం వస్తోంది.  – పెదపూడి బాపిరాజు, రైతు,  వాడపాలెం, కొత్తపేట మండలం

ఆరోగ్యానికి ఎంతో మేలు
ఎరుపు రకం అరటిపండ్లలో చక్కెరకేళి రకంలో ఇతర రకాల అరటిపండ్ల కన్నా వైవిధ్యకరమైన పోషకాలున్నాయని గుర్తించారు. బీటా కెరోటిన్‌ అనే పిగ్మెంట్‌ మిగిలిన పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అధికంగా పొటాషియం, విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. రక్తపోటు, ఒబేసిటీ బాధితులకు ఇది మంచిది. – వడ్డాది సురేశ్,  ఎండీ జనరల్, వడ్డాది ఆస్పత్రి,   రాజమహేంద్రవరం

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)