Breaking News

గీతాంజలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేత

Published on Fri, 03/15/2024 - 04:41

తెనాలి: టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా మూకల అసభ్యకర పోస్టింగులకు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన గొల్తి గీతాంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబానికి అందింది. గీతాంజలి కుమార్తెలు రిషిత, రిషికల పేరిట చెరొక రూ.10 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆ పత్రాలను గురువారం సాయంత్రం గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు.

ముందుగా గీతాంజలి చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావుతో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డిపాజిట్‌ పత్రాలను చిన్నారులకు అందజేశారు. ప్రభుత్వం ద్వారా తన కుటుంబానికి జరిగిన మేలును గీతాంజలి బహిరంగంగా మీడియాలో చెప్పటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా మూకలు వికృత పోస్టింగులతో ఆమె బలవన్మరణానికి కారకుల­య్యారని ఎమ్మెల్యే శివకుమార్‌ ధ్వజమెత్తారు.

తన చేత్తో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందుకున్న గీతాంజలి భౌతికకాయానికి తానే పూల­మాల వేయాల్సి రావటం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతగానో కలచివేసిందన్నారు. అమాయక మహిళలపై ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. 

ఎన్నారై పంచ్‌ ప్రభాకర్‌ రూ.2 లక్షల సాయం
టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబానికి ఎన్నారై పంచ్‌ ప్రభాకర్‌ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆయన పంపిన డబ్బు­ను గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ యువ­జన విభాగం జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి, స్థానిక నేతలు గీతాంజలి భర్త బాలచంద్ర, చిన్నా­రులు రిషిత, రిషికలకు అందజేశారు.

ఈ నగదు సాయం చేసిన ఎన్నారై పంచ్‌ ప్రభాకర్‌ వీడియో కాల్‌ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ఖర్చులను తన మిత్ర బృందంతో కలిసి తామే భరిస్తామని హామీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వేధింపులు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్థిక సాయం అందించిన పంచ్‌ ప్రభాకర్‌కు బాలచంద్ర ధన్యవాదాలు తెలిపారు. 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)